తెలంగాణ

telangana

ETV Bharat / crime

పంజాగుట్ట ఫ్లైఓవర్​ కింద అగ్నిప్రమాదం - fire accident at punjagutta flyover in Hyderabad

హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ పిల్లర్​‌కు ఏర్పాటు చేసిన డెకరేషన్​లో మంటలు చెలరేగడం వల్ల వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

fire-accident-at-punjagutta-flyover-in-hyderabad
పంజాగుట్ట ఫ్లైఓవర్​ కింద అగ్నిప్రమాదం

By

Published : Mar 16, 2021, 12:32 PM IST

హైదరాబాద్ పంజాగుట్ట పైవంతెన కింద స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పిల్లర్‌కు ఏర్పాటు చేసిన ఫైబర్ డెకరేషన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు, ట్రాఫిక్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటం వల్ల వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.

మూడ్రోజుల క్రితం ఇదే తరహాలో డెకరేషన్ సెట్‌ ద‌గ్ధమవడం.. మరోసారి అలాగే జరగడం కలకలం రేపింది. ఈ ఘటనతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.

పంజాగుట్ట ఫ్లైఓవర్​ కింద అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details