Fire Accident in NTR District Today : ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయ దుకాణ సముదాయంలో అర్ధరాత్రి తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ దుకాణ సముదాయంలోని 20 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు దృష్ట్యా.. వ్యాపారులు పెద్దఎత్తున వస్తు సామగ్రి కొనుగోలు చేసి దుకాణాల్లో ఉంచారు. ఒక్కో దుకాణంలో సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల విలువైన వస్తువులు ప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తంగా రూ.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాద స్థలిని ఆలయ ఈవో, ఛైర్మన్, తహసీల్దార్ పరిశీలించారు.
భారీ అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగి 20 దుకాణాలు దగ్ధం - ntr district fire accident news
భారీ అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగి 20 దుకాణాలు దగ్ధం
06:06 January 27
భారీ అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగి 20 దుకాణాలు దగ్ధం
Last Updated : Jan 27, 2023, 7:10 AM IST