నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం నేతపురం గ్రామంలో గాలికి విద్యుత్ తీగలు తెగి పక్కనే ఉన్న పూరిగుడిసెలపై పడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల తన్నీరు లింగమ్మ, పొదిలి ముత్తాలమ్మ నివాసముంటున్న గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు తీగలు తెగిపడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కానీ రెండు ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి.
విద్యుత్ తీగలు తెగిపడి రెండు పూరి గుడిసెలు దగ్ధం - nalgonda latest crime news
నల్గొండ జిల్లా నేతపురంలో గాలికి విద్యుత్ తీగలు తెగిపడి రెండు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.
విద్యుత్ తీగలు తెగిపడి రెండు పూరి గుడిసెలు దగ్ధం
విషయం గ్రహించిన స్థానికులు మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని బాధిత మహిళలు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి:నేడు, రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిపివేత