నల్లమల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, మన్ననూర్ అటవీ రేంజ్ పరిధిలో ఉవ్వెత్తున మంటలు వ్యాపించాయి. మన్ననూర్ బేస్ క్యాంపు సమీపంలో మరియు అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని గుండం, నందనపడేలు ప్రాంతాల్లో అడవి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని 18మంది అటవీశాఖ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రాత్రి వరకు మంటలను అదుపు చేశారు.
మానవతప్పిదాల వల్లే నల్లమలలో అగ్నిప్రమాదం
నల్లమల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. సుమారు 25 హెక్టార్ల అడవి కాలిపోయిందని అటవీ శాఖ రేంజ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. మానవ తప్పిదాల వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
నల్లమల అడవి, నల్లమల అడవిలో అగ్నిప్రమాదం
సుమారు 25 హెక్టార్ల అడవి కాలిపోయిందని అటవీశాఖ రేంజ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. మానవ తప్పిదాల వల్లే తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అడవుల్లోకి వెళ్లిన వ్యక్తులు అగ్నిమాపక వస్తువులు తీసుకెళ్లకూడదని కోరారు.
- ఇదీ చదవండి :నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు