సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో.. పెరుమాళ్ల రత్తయ్య అనే రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పంటించాడు. ఈదురుగాలులు రావడం వల్ల మంటలు పక్కనే ఉన్న మరో రైతు పొలానికి వ్యాపించాయి. అక్కడే ఉన్న గడ్డివాములకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి.
Fire Accident : మంటలు అంటుకుని గడ్డివాములు దగ్ధం - fire accident in suryapet district
పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న గడ్డివాములు కూడా అంటుకుని దగ్ధమయ్యాయి. ఈ అగ్నిప్రమాదం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లాలో అగ్నిప్రమాదం, నాగారంలో అగ్నిప్రమాదం, నాగారంలో గడ్డివాములు దగ్ధం
వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి.. పంచాయతీ వాటర్ ట్యాంక్ ద్వారా మంటలు ఆర్పారు. సుమారు రూ.30 వేలు నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపారు. వేసవిలో.. వరికొయ్యలు తగులబెట్టేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ సూచించారు.
- ఇదీ చదవండి :టాయిలెట్ గుంతలో గేదె.. బయటపడింది ఇలా!