తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్​ వీడియో: సింగరేణి సీహెచ్​పీలో అగ్నిప్రమాదం - తెలంగాణ వార్తలు

బొగ్గుతో ఉన్న టిప్పర్​లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో లారీకి మంటలు వ్యాపించాయి. లారీలతో పాటు అందులో ఉన్న బొగ్గు చాలావరకు దగ్ధం అయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి సీహెచ్​పీలో జరిగింది.

fire accident at mancherial singareni chp and two lorries burn
లైవ్​ వీడియో: సింగరేణి సీహెచ్​పీలో అగ్నిప్రమాదం

By

Published : Feb 8, 2021, 7:28 PM IST

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి సీహెచ్​పీలో అగ్నిప్రమాదం జరిగింది. బొగ్గును అన్​లోడ్​ చేసేందుకు వచ్చిన టిప్పర్​లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మరో లారీకి వ్యాపించగా.. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి.

వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే లారీలతో పాటు అందులో ఉన్న బొగ్గు చాలావరకు దగ్ధం అయింది. ఘటనా స్థలాన్ని రామకృష్ణాపూర్ ఎస్సై రవి ప్రసాద్ పరిశీలించారు.

లైవ్​ వీడియో: సింగరేణి సీహెచ్​పీలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి:రికార్డు ధర పలికిన పసుపు.. రైతుల హర్షం

ABOUT THE AUTHOR

...view details