Fire accident in Motor Showroom: ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాలకొండలో 'మనం' మోటర్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. దీపావళి ధమాకా స్పెషల్ ఆఫర్‌తో బైక్ బ్యాటరీలు భారీగా షోరూంకు వచ్చాయి. అర్ధరాత్రి మంటలు చెలరేగి 36 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేశారు. సుమారుగా రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని షోరూమ్ యజమాని రమేష్ తెలిపారు.
మోటర్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. 36 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం - మన్యం జిల్లా నేర వార్తలు
Fire accident in Motor Showroom: ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో దీపావళి వేళ ఓ మోటర్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 36 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
Fire accident