తెలంగాణ

telangana

ETV Bharat / crime

కొత్తపేటలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ వద్ద చెలరేగిన మంటలు - కొత్తపేట ప్లాస్టిక్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం

ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ముందు నిల్వ ఉంచిన ప్లాస్టిక్ స్క్రాప్​లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సహాయంతో పోలీసులు మంటలను అర్పివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

kothapet  fire accident, fire in plastic factory
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, కొత్తపేట వార్తలు

By

Published : Mar 27, 2021, 7:17 PM IST

రంగారెడ్డి జిల్లా కొత్తపేట పరిధిలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఎదుట ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ భారీగా ప్లాస్టిక్ స్క్రాప్ ఉండడం వల్ల క్షణాల్లో మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మంటలను అర్పివేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details