తెలంగాణ

telangana

By

Published : Aug 23, 2021, 4:53 AM IST

ETV Bharat / crime

Fire Accident: కాటేదాన్​ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.. రెండు గోదాంలు దగ్ధం

హైదాబాద్​ కాటేదాన్​ పారిశ్రామికవాడలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో రెండు గోదాములు మంటలకు ఆహుతయ్యాయి. చూస్తుండగానే మంటలు చెలరేగాయి. రెండు గంటల పాటు నాలుగు ఫైరింజన్లు శ్రమించి మంటలను అదుపు చేశాయి.

Fire Accident at katedhan industrial area
Fire Accident at katedhan industrial area

కాటేదాన్​ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.. రెండు గోదాంలు దగ్ధం

హైదరాబాద్‌ కాటేదాన్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు గోదాములు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. స్పాంజ్‌ గోదాములో ముందుగా మంటలు చెలరేగాయి. దాన్ని ఆనుకొని ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాల గోదాముకు మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు అగ్నిమాపక శకటాలతో రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అర్ధరాత్రి కావడం వల్ల గోదాముల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details