FIRE ACCIDENT AT CRACKERS SHOP: కొనుగోలుదారుడి అత్యుత్సాహం .. బాణాసంచా దుకాణాదారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా వడవలపేట మండలం నారాయణదాసు తోటలో చోటు చేసుకుంది. కొనుక్కున్న టపాకాయల నాణ్యతను పరిశీలించేందుకు.. దుకాణం సమీపంలోనే వెలిగించాడు. దీంతో నిప్పురవ్వలు చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లోకి ఎగిసి పడి.. షాపులకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన దుకాణదారులు షాపుల నుంచి బయటకు రావడంతో.. పెను ప్రమాదం తప్పింది.
కొనుగోలుదారుడి అత్యుత్సాహం.. దుకాణం వద్దే టపాకాయలు పేల్చి చూశాడు, ఆ తరువాత .. - బాణాసంచా దుకాణాలలో అగ్నిప్రమాదం
దీపావళి వచ్చిందని ఓ వ్యక్తి టపాకాయల దుకాణానికి వెళ్లాడు. నచ్చినవి కొన్నాడు. ఆ తరువాత వాటిని టెస్ట్ చేయాలనిపించింది. ఇంకేముంది షాప్ దగ్గరే వాటిని వెలిగించాడు. అంతే నిప్పురవ్వలతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కనున్న పలు దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. అయితే ఆస్తినష్టం జరిగినా ప్రాణనష్టం మాత్రం తప్పింది.
FIRE ACCIDENT
ఈ ఘటనలో సుమారు 20 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: