fire Accident in jagityal: జగిత్యాల జిల్లా కోరుట్లలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. శివారులో ఉన్న ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన సామాగ్రి దుకాణంతో పాటు పక్కనే ఉన్న మామిడికాయల గోదాంకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల గ్రామస్థులు గమనించి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.
fire Accident in jagityal: ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన సామాగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం - కోరుట్లలో అగ్ని ప్రమాదం
fire Accident in jagityal: తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన సామాగ్రి దుకాణం, మామిడికాయల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా నష్టపోయానని బాధితుడు వాపోయాడు.
వాహన సామాగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం
అగ్నిమాపక వాహనం వచ్చేవరకు స్థానికులు దుకాణంలో ఉన్న సామాగ్రి బయటకు తీశారు. అయినా అప్పటికే సగం వరకు పూర్తిగా మంటలు అంటుకున్నాయి. చాలా వరకు సామాగ్రి కాలి బూడిద అయ్యింది. ఈ ఘటనతో భారీగా నష్టపోయానని బాధితుడు వాపోయాడు.