Fire Accident at Jubilee hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ విద్యుత్ స్తంభం వద్ద మంటలు చెలరేగాయి. రోడ్ నెంబర్- 45 లో ఉన్న ఓ విద్యుత్ స్తంభానికి నెట్‌వర్క్‌లకు చెందిన కేబుళ్లు తగిలించారు. గజిబిజిగా ఉన్న కేబుళ్లలో మంటలు చెలరేగి... పెద్దఎత్తున స్తంభానికి వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనలో రోడ్‌నెంబర్- 45లో కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలను అదుపు చేసిన అనంతరం ట్రాఫిక్ పోలీసులు రద్దీని నియంత్రించారు.