మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దూలపల్లి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. గాలి ప్రవాహం తోడవడంతో మంటలు అంతకంతకూ పెరిగి... 10హెక్టార్లకు వ్యాపించాయి. భారీగా చెట్లు తగలబడ్డాయి.
దూలపల్లి అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు - తెలంగాణ వార్తలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దూలపల్లి అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నికి గాలి ప్రవాహం తోడవడంతో కార్చిచ్చు వేగంగా వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
దూలపల్లి అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు
కార్చిచ్చు చెలరేగిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని... మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టగా... వెదురు చెట్లు ఉండటంతో అదుపులోకి రావడం కష్టంగా మారింది. సుమారు మూడు గంటలపాటు శ్రమించిన అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అటవీ, అగ్నిమాపక, మున్సిపల్ సిబ్బంది ఈ చర్యల్లో పాల్గొన్నారు
ఇదీ చదవండి:యువకుడి తలపై ఇనుప రాడ్తో మోది హత్య.. పాతకక్షలే కారణమా?
Last Updated : Mar 19, 2021, 2:05 PM IST