Fire Accident in Jeedimetla Today : జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం - జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
13:06 December 30
Fire Accident in Jeedimetla Today : జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం
Fire Accident in Jeedimetla Today : హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఫేజ్-1లోని ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ ఓ మెషీన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వ్యాపిస్తాయనే భయంతో అక్కణ్నుంచి పరుగులు తీశారు.
Fire Accident in Jeedimetla : ఫైర్ ఇంజిన్ రావడానికి ఆలస్యం కావడం వల్ల సంస్థ లోపల పొగలు కమ్ముకున్నాయి. చాలా సమయం వరకు సిబ్బంది పరిశ్రమ బయటే ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం ఏ మేర జరిగిందో అధికారులు అంచనా వేస్తున్నారు.