తెలంగాణ

telangana

ETV Bharat / crime

షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు - నల్లగుట్ట వద్ద అగ్నిప్రమాదం

secunderabad fire accident
secunderabad fire accident

By

Published : Jan 19, 2023, 12:04 PM IST

Updated : Jan 19, 2023, 1:48 PM IST

06:34 January 19

సికింద్రాబాద్ పరిధి నల్లగుట్టలోని షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ పరిధి నల్లగుట్టలోని షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం

Fire Accident in Shopping Mall: సికింద్రాబాద్‌లో మరోసారి అగ్నిప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గత కొన్నినెలల క్రితం ఘోర ప్రమాదాలు జరిగిన క్రమంలోనే తాజాగా మరోసారి ఓ భవనంలో మంటలు చెలరేగటం ఆందోళనకు గురిచేస్తోంది. సికింద్రాబాద్‌లోని నల్లగుట్ట ప్రాంతంలో ఉన్న ఓ ఐదంతస్తులో భవనంలోని సెల్లార్‌లో కార్ల విడిభాగాలకు సంబంధించిన గోదాము కొనసాగుతోంది. అలాగే... గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వస్త్ర దుకాణం ఉండగా.... మొదటి అంతస్తులో క్రీడాసామాగ్రి దుకాణం కొనసాగుతోంది. పై మూడంతస్తుల్లోనూ ఇతర వ్యాపార సంస్థలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెల్లార్‌లోని కార్ల విడిభాగాల గోదాములో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత చిన్న ప్రమాదంగా భావించినప్పటికీ.... ఒక్కసారిగా పెద్దఎత్తున అలుముకున్న పొగ, మంటలు ఎగిసిపాటుతో అక్కడి ప్రజలు పరుగులు తీశారు. కాసేపు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానికుల సమాచారంతో వెంటనే 3 ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకోగా... అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానం : భవనంలో క్రమంగా వ్యాపించిన మంటలు.... పెద్దఎత్తున ఎగిసిపడి, పైఅంతస్తులకు వ్యాపించాయి. కార్ల విడిభాగాల గోదాము, వస్త్ర దుకాణం నుంచి మొదటి అంతస్తుల్లో ఉన్న క్రీడాసామాగ్రి దుకాణంతో పాటు పైనున్న అన్ని అంతస్తుల్లో ఎగిసిపడిన మంటలు... పక్కనున్న భవనాలకు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా... ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్తులో ముగ్గురు, రెండో అంతస్తులో మరో వ్యక్తి చిక్కుకుపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వెంటనే స్కైలిఫ్ట్‌ను ఘటనాస్థలికి రప్పించి... సహాయక చర్యలు చేపట్టారు. దట్టంగా అలుముకున్న పొగ కారణంగా.... పైనున్న వారిని దించటం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. అయినప్పటికీ తీవ్రంగా శ్రమించి, అతికష్టం మధ్య భవనంలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చారు. ప్రమాదంలో మరో ఇద్దరు ఉన్నట్లు సహాయక సిబ్బంది అనుమానిస్తున్నారు.

తొలుత మూడు ఫైరింజన్లు వచ్చినా మంటలు, పొగ అదుపు కాకపోవటంతో మరో మూడింటిన ఘటనాస్థలికి తెప్పించారు. ఇలా.... ఆరు ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ గంటల తరబడిగా పరిస్థితి అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బందితో పాటు డీఆర్​ఎఫ్​, స్థానిక పోలీసులు, 108 సిబ్బంది ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 19, 2023, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details