సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. కళాశాల మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది.
మహిళా డిగ్రీ కళాశాలలో అగ్ని ప్రమాదం - ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. కళాశాల మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటుచేసుకుంది.

మహిళా డిగ్రీ కళాశాలలో అగ్ని ప్రమాదం
దట్టమైన పోగ రావడంతో అప్రమత్తమైన కళాశాల నిర్వాహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగినప్పుడు ల్యాబులో విద్యార్థులు లేకపోవడంతో కళాశాల నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి :నడిరోడ్డుపై కారు దగ్ధం.. ఎగసిపడిన మంటలు