తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​లో విలాసా సౌకర్యాల పేరుతో మోసం... కంట్రీ క్లబ్‌కు జరిమానా - TELANGANA CRIME NEWS

సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న సభ్యుడికి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించని ఓ కంట్రీ క్లబ్‌పై జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. అతను కట్టిన డబ్బుతో పాటు 18శాతం వడ్డీ జమ చేస్తు అదనంగా రూ.15 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Fine to Country Club
కంట్రీ క్లబ్‌కు జరిమానా

By

Published : Sep 6, 2021, 12:44 PM IST

సభ్యత్వం తీసుకుంటే ఫిట్‌నెస్‌ సెంటర్లు, స్విమ్మింగ్‌ ఫూల్‌, హాలిడే ట్రావెల్‌ ప్యాకేజీలు తదితర సేవలు అందుకునే అవకాశం ఉంటుందని నమ్మబలికారు కంట్రీక్లబ్‌ ప్రతినిధులు.. వారి ఒత్తిడి మేరకు ఉప్పల్‌కు చెందిన వై.వెంకట శ్రీనివాసరెడ్డి సభ్యత్వం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.56వేలు చెల్లించారు.

ఫిట్‌నెస్‌ సెంటర్‌ హబ్సిగూడలో ఉందని చెప్పడంతో చూడటానికి వెళ్లిన శ్రీనివాస్‌ అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. పూర్తిగా పాడయిపోయి శిథిలావాస్తలో ఉండటంతో తన సభ్యత్వాన్ని రద్దు చేసి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మెయిల్‌ ద్వారా కంట్రీక్లబ్​ వారిని అడిగారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి బేగంపేట్‌లోని కార్యాలయానికి వెళ్లి లేఖ ద్వారా అభ్యర్థించారు.

కొన్నాళ్లకు విడతలవారీగా 90 రోజుల్లోగా డబ్బు తిరిగిస్తామని చెప్పిన ప్రతినిధులు ఆ హామీని మరచిపోయారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్‌-3, సాక్ష్యాధారాలు పరిశీలించి నిబంధనల ప్రకారం రూ.52,200, 18శాతం వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు పరిహారంగా రూ.10వేలు, కేసు ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:

ముక్కోణపు ప్రేమ.. లాటరీలో వరుడు

ABOUT THE AUTHOR

...view details