తెలంగాణ

telangana

ETV Bharat / crime

మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. ఎందుకంటే? - మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీపై కేసు

Film actress Karate Kalyani and several Hindu groups have filed a complaint against film director Devisree Prasad in cyber crimes
మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు.

By

Published : Nov 2, 2022, 5:06 PM IST

Updated : Nov 2, 2022, 5:32 PM IST

17:00 November 02

మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌పై నటి కరాటే కల్యాణి, హిందూ సంఘాల ఫిర్యాదు నమోదు చేశారు. హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఒపరి ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు.

అయితే దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో ఒకరు రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ఎన్నో సూప‌ర్ హిట్ ఆల్బ‌మ్స్ అందించాడు దేవీ. ఈ రాక్ స్టార్ కంపోజ్ చేసిన నాన్‌-ఫిల్మ్ మ్యూజిక్ వీడియో ఓ ప‌రి సాంగ్. ఈ పాట‌ను దేవీ శ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేయ‌డ‌మే కాకుండా స్వ‌యంగా పాడాడు. పాన్ ఇండియా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆకట్టుకునేలా పాట కంపోజ్ చేశాడు. అయితే ఈ పాటలోహరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఐటెం సాంగ్‌గా మార్చారని కరాటే కల్యాణి, హిందూ సంఘాలు మండిపడ్డాయి.

ఇవీ చూడండి:

Last Updated : Nov 2, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details