Film Actor Arrest Harassing Junior Artist: జూనియర్ ఆర్టిస్టును ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన సినీ నటుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధింపులు గురిచేయడంతో పాటు కులం పేరుతో దూషిస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన మోసాన్ని ఫిర్యాదులో తెలిపింది. జులై 9న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటినుంచి నిందితుడు తప్పించుకుని తిరిగాడు. ఆ రోజు నుంచి కనిపించకుండా తిరిగిన సినీ నటుడు ప్రియాంత్‌ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 'కొత్తగా మా ప్రయాణం' సినిమా హీరో ప్రియాంత్‌కు ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కొన్ని రోజులకు మరింత దగ్గరైంది. ఇదే చనువుగా తీసుకున్న ప్రియాంత్ రెండు నెలల తర్వాత ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. దాంతో అప్పటినుంచి వారిద్దరి మధ్య ప్రేమాయాణం కొనసాగింది. ఈ క్రమంలో ఒక రోజు ప్రియాంత్ ఆమెకు ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకుందాం బయటకిరా అని మాయ మాటలు చెప్పాడు. అది నమ్మిన బాధితురాలు అతని బైక్ ఎక్కింది.