తెలంగాణ

telangana

ETV Bharat / crime

దెందులూరులో ఉద్రిక్తత.. వైకాపా, తెదేపా మద్దతుదారుల బాహాబాహీ

YCP and TDP fight : ఓ ఫేస్‌బుక్ పోస్ట్ రేపిన కలకలంతో ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరులో వైకాపా, తెదేపా మద్దతుదారులు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పోలీస్ స్టేషన్ వద్ద మోహరించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

YCP and TDP fight in Eluru
YCP and TDP fight in Eluru

By

Published : Jun 8, 2022, 8:29 AM IST

YCP and TDP fight : ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఓ ఫేస్‌ బుక్‌ పోస్ట్.. వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య వివాదానికి కారణమైంది. దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తిని కించపరుస్తూ పోస్టు పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు పోస్టు పెట్టిన వ్యక్తిపై దాడికి కుట్ర పన్నారు. దీంతో దెందులూరు పోలీసులు నిందితుడిని ముందే స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న తెలుగుదేశం, వైకాపా నాయకులు స్టేషన్ వద్దకు భారీగా చేరుకొని బాహాబాహీకి దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వీరిని అదుపు చేసే క్రమంలో ఎస్సై వీర్రాజుకు గాయాలయ్యాయి.

దెందులూరులో ఉద్రిక్తత

YCP and TDP supporters fight : పరిస్థితులు చేయి దాటుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను తరలించారు. ఇరు వర్గాలను స్టేషన్ నుంచి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో వైకాపా శ్రేణులు వచ్చి తమ ఇంటిపై దాడికి పాల్పడినట్లు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మహేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమైనట్లు వివరించారు. మరోవైపు శ్రీరామవరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details