కుమారుడి మణికట్టు కోసి చంపిన తండ్రి - కొడుకుని చంపిన తండ్రి
08:57 April 15
నాగర్‌కర్నూల్ మండలం మంతటిలో దారుణం
బిడ్డలను గుండెలపై పెట్టుకుని పెంచాల్సిన తండ్రి కసాయిగా మారాడు. చిన్నారుల మణికట్టును కోసి రాక్షసంగా ప్రవర్తించాడు. ఈ ఘటనలో ఓ కుమారుడు మృతి చెందగా... మరో చిన్నారి గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా మంతటిలో జరిగింది. గ్రామానికి చెందిన శివసంకర్ భార్య స్వప్న మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. తాగుడుకు బానిసైన శివశంకర్.. సైకోగా మారాడు.
ఉదయం 5 గంటల సమయంలో పెద్ద కుమారుడు మల్లికార్జున్, చిన్న కుమారుడు ప్రణయ్ మణికట్టు వద్ద నరం కత్తిరించాడు. పెద్ద కుమారుడు మృతి చెందగా.. కుటుంబ సభ్యులు పరిస్థితి గమనించి చిన్నవాడిని ఆస్పత్రికి తరలించగా... ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి:విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి