తెలంగాణ

telangana

ETV Bharat / crime

అంబులెన్స్​ సిబ్బంది కర్కశత్వంతో మరో అమానవీయ ఘటన.. బైక్​పైనే మరో మృతదేహం..

AP Ambulance Mafia : ఏపీలో అంబులెన్స్​ సిబ్బంది కనికరం అన్న మాటను వదిలేశారు. కర్కశంగా వ్యవహరిస్తూ.. అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులను మరింత ఇబ్బందిపెడుతున్నారు. మృతదేహాలను తరలించేందుకు నిరాకరిస్తూ.. అమానవీయంగా వ్యవహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఒకదానివెంట ఒకటి వెలుగుచూస్తూ.. ఇప్పడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అంబులెన్స్​ సిబ్బంది కర్కశత్వంతో మరో అమానవీయ ఘటన.. బైక్​పైనే మరో మృతదేహం..
అంబులెన్స్​ సిబ్బంది కర్కశత్వంతో మరో అమానవీయ ఘటన.. బైక్​పైనే మరో మృతదేహం..

By

Published : May 6, 2022, 10:43 AM IST

అంబులెన్స్​ సిబ్బంది కర్కశత్వంతో మరో అమానవీయ ఘటన.. బైక్​పైనే మరో మృతదేహం..

AP Ambulance Mafia : ఏపీలో వరుసగా అమానవీయ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఓవైపు వరుసగా చిన్నారులు మృత్యువాత పడటం కలచివేస్తోంటే.. వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్సులు నిరాకరిస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మొన్న తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్​ మాఫియా వల్ల బాలుడి మృతదేహాన్ని ఓ తండ్రి బైక్​పై తీసుకెళ్లగా.. అచ్చం అలాంటి ఘటనలే వరుసగా వెలుగుచూస్తున్నాయి. అప్పటికే కడుపున పుట్టిన పిల్లలు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే.. వారి మృతదేహాలని ఇంటికి తీసుకెళ్లేందుకు సహకరించకుండా పాశానాల్లా ప్రవర్తిస్తూ.. వారి బాధను రెట్టింపు చేస్తున్నారు.

AP Ambulance Mafia News : తిరుపతిలో రుయా ఘటన చర్చనీయాంశమై రెండు రోజులు కాకముందే.. జిల్లాలోని నాయుడుపేటలో మరో చోట అంబులెన్స్​ సిబ్బంది అదే తీరు అవలంభించి.. బాధలో ఉన్న మరో తండ్రిని ఇబ్బందిపెట్టారు. దొరవారిసత్రం మండలం కొత్తపల్లిలో.. గురువారం రోజు శ్రవంత్​, అక్షయ అనే అన్నాచెల్లెల్లు గ్రావెల్ గుంతలో పడి నీటిమునిగారు. శ్రవంత్‌ను అక్కడే ఉన్న గొర్రెల కాపరి కాపాడగా.. అక్షయ పరిస్థితి విషమించింది. నాయుడుపేట ఆస్పత్రికి తరలించేలోగా చిన్నారి మృతి చెందింది. కడివెడు దుఃఖంలో మునిగిపోయిన ఆ తండ్రి.. చిన్నారిని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్​ ఇవ్వాలని అడిగితే ఏమాత్రం కనికరం లేకుండా నిరాకరించారు. ఆటో డ్రైవర్లను బతిమాలినా ముందుకురాలేదు. భుజాల మీద ఎత్తుకుని ఆడించిన ఆ తండ్రి.. విగతజీవిగా మారిన కూతురిని అదే భుజానా వేసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకెళ్లాడు.

AP Ambulance Mafia Updates : నిన్న నెల్లూరు జిల్లాలోనూ ఇదే విషాదకర ఘటన పునరావృతమైంది. సంగం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచిన ఓ బాలుడి మృతదేహం తరలించేందుకు అంబులెన్స్​ వాహనం ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీలేక.. కడివెడు దుఃఖంలో ఉన్నా.. కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైక్​పైనే తీసుకెళ్లాల్సి వచ్చింది


ఇవీ చదవండి:

ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆ వయసు వారికే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details