Father sold his child: పిల్లలు జన్మించక చెట్లు, పుట్టలకు మొక్కేవారిని మన దేశంలో చాలా మందిని చూస్తుంటాం.. అమ్మ, నాన్న.. అనే పిలుపు కోసం పరితపిస్తూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారిని చూస్తుంటాం.. అందుకు భిన్నంగా ఆర్థిక పరిస్థితి బాగాలేక అబార్షన్లు, అమ్మకాలు చేయించుకునే వాళ్లను చూశాం.. కానీ చెడు అలవాట్లకు బానిసలుగా మారి పిల్లలను అమ్ముకునే వాళ్లను ఈ సమాజంలో చాలా అరుదుగా చూస్తుంటాం... ఇదిగో ఇదే కోవకు చెందుతాడు ఏపీలోని గుంటూరు జిల్లా గండాలయపేటకు చెందిన ఓ తండ్రి... కన్న బిడ్డ అనే బంధాన్ని మరిచి.. పుట్టిన మూడు నెలలకే తల్లిప్రేమకు దూరం చేశాడు. ఆపై 11 మందికి ఒకరి తర్వాత ఒకరికి విక్రయించాడు.. అసలేం జరిగిందంటే..?
father sold his child: గుంటూరు జిల్లా గండాలయపేటకు చెందిన మనోజ్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా... మూడు నెలల క్రితం మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టింది. చంటిపాపను కంటిపాపలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రి దురలవాట్లకు బానిసై.. తల్లి పొత్తిళ్లలో పసిపాపను అమ్మేశాడు. ఈనెల 5వ తేదీన తన మూడు నెలల చిన్నారిని పట్టణంలోని ఓ మహిళకు రూ.75 వేలకు విక్రయించాడు. సదరు మహిళ తెలంగాణలోని నల్గొండ జిల్లా కొండప్రోలులోని మరో మహిళకు ఆ బిడ్డను విక్రయించింది.