తెలంగాణ

telangana

ETV Bharat / crime

Father sexualyl harassed daughter : కన్నకూతురిపై తండ్రి లైంగిక వేధింపులు.. తల్లికి తెలిసినా... - father sexually harassed his daughter at yellandu

మానవత్వం మంటగలుస్తోంది, వావి వరస లేని సమాజాన్ని చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉన్న విలువైన సంబంధాలను విస్మరించి కామాంధులుగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. అందుకు నిదర్శనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన బాలికపై జరిగిన ఘోరం. బాలల పరిరక్షణ సంఘానికి బాధితురాలు చెప్పిన చేదు నిజాలు ఇవీ..

By

Published : Oct 2, 2021, 9:04 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన బాలిక.. తన తండ్రి నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడ(Father sexualyl harassed daughter)ని అధికారులకు ఫిర్యాదు చేసింది. నిత్యం మద్యం మత్తులో ఉండి.. కామంతో కళ్లు మూసుకుపోయి అసభ్యకరం(Father sexualyl harassed daughter)గా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. గత మూడేళ్లుగా ఈ దుశ్చర్య(Father sexualyl harassed daughter)కు పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో అర్థంగాక నరకయాతన అనుభవిస్తున్నానని వారి ముందు తన గోడు వెల్లబోసుకుంది. తన తల్లికి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదని చెప్పింది.

స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీడీఎస్​ అడిషనల్ సీడీపీవో విజయ కుమారి బాలిక ఇంటికి వెళ్లారు. ఆమెను విచారించగా.. పలు కీలక విషయాలు బయటపడ్డాయి.

"తండ్రి తనను లైంగిక వేధిస్తున్నాడ(Father sexualyl harassed daughter)నే విషయం ఆ బాలిక తల్లికి చెప్పింది. భర్త చేతిలో పావుగా మారిన తల్లి కన్నపేగు బాధ్యతను విస్మరించింది. ఏడాది క్రితం ఇదే ఆరోపణ తండ్రిపై రావడంతో ఆయన తనపై అభాండాలు వేస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కూతురి ఆవేదనను అర్థం చేసుకోలేని తల్లి ఆ విషయాన్ని కొట్టిపారేసింది. గత కొద్ది రోజుల క్రితం బాలికకు ఓ యువకుడితో ప్రేమ కొనసాగుతున్నట్లు గమనించిన తండ్రి తన కామవాంఛ(Father sexualyl harassed daughter) మరింత పెంచుకున్నాడు. బాలికపై వేధింపులు(Father sexualyl harassed daughter) అధికం చేశాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మేం బాధితురాలి ఇంటికి వెళ్లాం. ఆమెను విచారించగా చాలా దారుణమైన విషయాలు తెలిశాయి. బాధితురాలిని ప్రస్తుతం చైల్డ్ కేర్​ సెంటర్​కు తరలించాం."

- విజయ కుమారి, సీడీఎస్ ఏసీడీపీవో

నిందితుణ్ని విచారించి తర్వాత చర్యలు చేపట్టనున్నట్లు సీడీఎస్ ఏసీడీపీవో విజయ కుమారి తెలిపారు. బాలికలు, యువతులు, మహిళలు ఎవరైనా తమ ఇళ్లలో ఇలాంటి వేధింపులు (Father sexualyl harassed daughter)ఎదుర్కొంటే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details