తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape: వావివరుసలు మరిచి.. కన్న కూతురిపైనే అఘాయిత్యం - a father raped his daughter at west godavari district

ఏపీ తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే.. కామంతో కళ్లు మూసుకుపోయి సొంత కమార్తెతో పాటు మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలికకు కడుపునొప్పి రాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Rape
దారుణం

By

Published : Sep 5, 2021, 7:42 PM IST

ఏపీ తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి.. కన్న కూతురి(8)తోపాటు వరుసకు కూతురయ్యే మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలికకు కడుపు నొప్పి రాగా అసలు విషయం బయటపడింది. దీంతో కసాయి తండ్రి అఘాయిత్యాల గురించి కన్న కుమార్తె బయటపెట్టింది.

గ్రామస్థులు, కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ మురళీ మోహన్ ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దిశా చట్టం, ఫోక్సో చట్టం, అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి:Accident: ప్రయాణంలో ఉండగా ఊడిన బస్సు చక్రాలు..

ABOUT THE AUTHOR

...view details