Father raped minor daughter: కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే ఆటోడ్రైవరు భార్యకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగా లేదు. దీంతో కొద్దిరోజుల క్రితం ఇంటికొచ్చిన సోదరుడితో కలిసి పిల్లలను తీసుకొని వెళ్లాలని నిర్ణయించుకొంది. అయితే కుమార్తెను, ఇద్దరు కుమారులను తనవద్దనే ఉంచుకుంటానని భర్త చెప్పడంతో ఆమె సోదరుడితో కలిసి వెళ్లింది. ఈనెల 9న యథావిధిగా ఇంటికొచ్చిన తండ్రి అర్ధరాత్రి దాటిన తరువాత కుమార్తె(15) నోరు నొక్కి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Father raped minor daughter: అమానవీయ ఘటన.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం - Father raped minor daughter in jubilee hills
Father raped minor daughter: Father murdered daughter: కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు వావివరుసలు మరిచిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నాడు. ఆడపిల్లలకు బయటే కాదు.. ఇంట్లో కన్న వాళ్ల మధ్యే రక్షణ లేదని ఇటీవల జరిగిన పలు అమానవీయ ఘటనల ద్వారా నిరూపిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ ఠాణా పరిధిలో కన్నకూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
విషయాన్ని మరుసటి రోజు తన సోదరుడికి తెలియజేయగా, ఇద్దరూ కలిసి మహబూబ్‌నగర్‌లో ఉన్న తల్లి వద్దకు వెళ్లారు. జరిగిన విషయాన్ని కుమార్తె తల్లితో చెప్పడంతో శుక్రవారం నగరానికి వచ్చిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ఆడపిల్ల పుడుతుందని మనోవేదనతో గృహిణి ఆత్మహత్య.. తీరా పోస్టుమార్టంలో చూస్తే!