తెలంగాణ

telangana

ETV Bharat / crime

Father raped Daughters : కన్నతండ్రే కాటేస్తే.. చావే శరణమనుకున్నారు కానీ.. - కుమార్తెలపై తండ్రి అఘాయిత్యం

Father raped Daughters in Vanasthalipuram : కన్నతండ్రే వాళ్లని కాటేశాడు. మానవత్వాన్ని మరిచి మృగంలా మారాడు. మద్యానికి బానిసై విచక్షణ కోల్పోయాడు. తాగిన మత్తులో కన్న కూతుళ్లు అని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తించాడు. అడ్డొచ్చిన భార్యను కొట్టి ఇంట్లో నుంచి గెంటేసి మరీ.. కుమార్తెలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కీచక తండ్రి. ఈ అమానుష ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది.

Father raped Daughters
Father raped Daughters

By

Published : Mar 21, 2022, 6:49 AM IST

Father raped Daughters in Vanasthalipuram : మానవత్వం మంట కలిసింది. ఓ కర్కశ తండ్రి కన్న కూతుళ్లపైనే లైంగికదాడికి యత్నించాడు. వనస్థలిపురం ఠాణా పరిధిలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తికి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13, 11 ఏళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. వనస్థలిపురంలోని ఓ కాలనీలో ఉంటున్నారు. అతను ఆటోడ్రైవర్‌. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం మద్యం తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భార్య ప్రతిఘటించేది.

భార్యను ఇంట్లో నుంచి గెట్టేసి..

Father raped Daughters in Hyderabad : అయితే, ఈనెల 17న ఆమెను కొట్టి ఇంటి నుంచి వేరే గ్రామానికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి తొలుత తన 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. అనంతరం ఆ అక్కాచెల్లెళ్లు తప్పించుకుని షీ టీమ్‌ పోలీసులకు ఫోన్‌ చేశారు. రెండు గంటలైనా స్పందన లేకపోవడంతో తమను పోలీసులు రక్షించలేరని భావించి ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు.

కీచక తండ్రి అరెస్టు..

Father Sexually Harassed Daughters : ఆ సమయంలో అక్కడున్న మహిళ వారిని చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్‌ నంబరు ఇచ్చింది. ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్‌ చేసి వివరాలు తెలపగా సదరు ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఠాణాకు తీసుకెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కుమార్తెలపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోక్సో చట్టం ప్రకారం అతడిపై కేసు నమోదుచేసి శనివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details