Murder attempt in Anantapur: ఆంధ్రప్రదేశ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న న్యాయవాది మహబూబ్ బాషాకు హుస్సేన్ అనే 21 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని హుస్సేన్ ఇటీవల తండ్రితో గొడవపడ్డాడు. ఈ విషయమై బాషాను బంధువులు మందలించారు. ఆగ్రహించిన మహబూబ్ బాషా నిన్న సాయంత్రం నమాజ్ చేసుకుంటున్న కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాషాకూ గాయాలయ్యాయి. హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి :
Honor Killing News : నవమాసాలు కడుపులో పెట్టుకుని చూసుకున్న తల్లి... బిడ్డ భూమ్మీదకు రాగానే తన కంటిపాపలా కాపాడుకుంటుంది. ఆ బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతుంది. ఏం కావాలన్నా చేసిపెడుతుంది. ఏదడిగినా ఇచ్చేస్తుంది. అలాంటి మమతకు మారుపేరైన కన్నతల్లి.. వేరే కులం వాడిని ప్రేమించిందన్న కారణంతో అపురూపంగా.. తన ఆరోప్రాణంగా చూసుకున్న కుమార్తెను మట్టుబెట్టింది. తన తల్లితో కలిసి కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Honor Killing Latest News : తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని.. కన్న కూతురిని ఓ వ్యక్తి అతి కిరాతకంగా కొట్టి హత్య చేశాడు. మరోవైపు.. కట్టుకున్న భార్యను గొంతుకోసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ రెండు ఘటనలు ఉత్తర్ప్రదేశ్లో జరిగాయి. హరియాణాలో జరిగిన మరో ఘటనలో ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువతిని పిస్తోలుతో కాల్చి చంపాడు ఓ కిరాతకుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కుమార్తెను ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో జరిగింది. గ్రామంలో ఓ యువతిని ధనశేఖర్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ధనశేఖర్‌ను యువతి తండ్రి బాబు దారుణంగా హతమార్చాడు. బాబు పొలంలోనే ధనశేఖర్ మృతదేహం లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి