కన్నకొడుకుని బస్సులో వదిలి వెళ్లిన సంఘటన ఇది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పాపయ్య, అతని కుమారుడు బన్ను(10) ఆర్టీసీ బస్సు ఎక్కారు. మధ్యలోనే తండ్రి దిగిపోవడం వల్ల ఆ బాలుడు బస్సులోనే ఉండిపోయాడు. ఏడుస్తూ ఉండటం గమనించిన ఆర్టీసీ సిబ్బంది బాలుడిని గుమ్మడిదల పోలీసులకు అప్పగించారు.
కొడుకును ఆర్టీసీ బస్సులో వదిలేసిన తండ్రి! - గుమ్మడిదల తాజా వార్తలు
తన కుమారుడిని ఆర్టీసీ బస్సులో వదిలేశాడో తండ్రి. ఎందుకు తనను వదిలి వెళ్లాడో తెలియని ఆ బాలుడు బస్సులోనే ఉండిపోయాడు. ఏడుస్తుండగా గమనించిన ఆర్టీసీ సిబ్బంది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీసులకు అప్పగించారు.
sangareddy news, telangana news
అమీన్‌పూర్‌లోని అనాథాశ్రమంలో బాలుడిని ఉంచారు. పోలీసుల దర్యాప్తులో బాలుని తండ్రి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందినవాడిగా గుర్తించారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బాలుడి బాబాయ్ పోలీస్ స్టేషన్‌కు వస్తానని చెప్పారు. అయితే తండ్రి బాలుని వదిలేసి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి:ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి