మెదక్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కుమ్మరి రవి అనే వ్యక్తిపై సోదరుడు శ్రీనివాస్, తండ్రి లక్ష్మయ్య కలిసి రోకలిబండతో దాడిచేశారు. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య గత సంవత్సరం క్రితం పిట్లం చెరువులో తన కూతురితో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుందని పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. అప్పటి నుంచి మృతుడు రవి మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవారని పేర్కొన్నారు.
Murder: దారుణం... కొడుకును చంపిన తండ్రి... ఎందుకో తెలుసా? - మెదక్ జిల్లా వార్తలు
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు(Murder) గురైన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో జరిగింది. కుమ్మరి రవి అనే వ్యక్తిపై .. తండ్రి లక్ష్మయ్య, సోదరుడు శ్రీనివాస్ కలిసి రోకలిబండతో దాడిచేశారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Murder
మృతుడి అన్న శ్రీనివాస్, తండ్రి లక్ష్మయ్య పరారీలో ఉన్నట్టు పట్టణ సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'అర్ధ నగ్నంగా ఉండమంటాడు.. మూత్రం తాగమంటాడు'