Father Killed Daughter : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని బాపన్‌గుట్ట తండాకు చెందిన నరేష్, రజనిల కుమార్తె ప్రియ(9నెలలు) అదృశ్యమైనట్లు ఆదివారం సాయంత్రం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కిషన్‌నగర్ శివారులో చెట్లపొదల్లో చిన్నారి శవం ఉన్నట్లు సోమవారం సమాచారం అందగా పోలీసులు పరిశీలించారు. ప్రియ మృతదేహం కనిపించింది. తలపై కొట్టి చంపినట్లు గుర్తించారు.
Father Killed Daughter : చిట్టితల్లిని చిదిమేసిన కర్కశ తండ్రి - కూతుర్ని చంపిన తండ్రి
Father Killed Daughter : తల్లిదండ్రులే తన ప్రపంచంగా భావించే.. లోకం తెలియని 9 నెలల పసికందుని కన్నతండ్రే చిదిమేశాడు. తానే చంపినట్లు పోలీసుల ముందు తండ్రి అంగీకరించగా, తల్లిపాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంపి వచ్చి ఫిర్యాదు.. కుమార్తెను హతమార్చిన నరేష్ భార్యతో కలిసి ఆదివారం నేరుగా షాద్‌నగర్ ఠాణాకు వచ్చాడు. కుమార్తె కనిపించడం లేదంటూ హంగామా చేశాడు. కూలిపని చేసుకునే ఈ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మద్యం తాగి గొడవ పడుతుంటారు. బాలికను మద్యం మత్తులో చంపేశాడా, తమ ఆరోగ్య పరిస్థితి కారణంగా హతమార్చాడా అన్నది తేలాల్సి ఉంది. బలంగా తోయడంతో గోడకు తగిలి మరణించిందంటున్నాడు. భార్యాభర్త పొంతన లేని సమాధానం చెబుతుండడంతో ఆమె పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీఐ నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
- ఇదీ చదవండి :పల్లీ యంత్రం.. ఆ బాలుడి భవిష్యత్తును చిదిమేసింది