తెలంగాణ

telangana

ETV Bharat / crime

కోడలిపై కన్నేసిన మామ.. కాదన్నందుకు హత్యాయత్నం - father in law tried to kill daughter in law

Murder attempt on Daughter in Law: తండ్రి తర్వాత తండ్రిలా కోడలికి భరోసా ఇవ్వాల్సిన మామ.. మానవత్వాన్ని మరిచాడు. కుమారుడు చనిపోతే అతని భార్యను కూతురిలా ఆదరించాల్సిన మామ.. ఆమెపై పశువాంఛతో రగిలిపోయి వశపరుచుకోవాలని చూశాడు. అందుకోసం ప్రణాళికలు వేశాడు. పిల్లలున్నారని కూడా ఆలోచించకుండా.. మంచివాడిలా నటించి.. అదును చూసి మనసులోని నీచ ఆలోచనను బయటపెడ్డాడు. అది విని షాకయిన కోడలు.. వద్దని వారించింది.. బతిమిలాడింది.. ఫిర్యాదులు చేసింది. దీంతో తన మాటకు ఎదురుతిరిగేసరికి చివరికి కోడలిని చంపాలని చూశాడు ఆ కీచకుడు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

father in law tried to kill daughter in law
కోడలిపై మామ హత్యాయత్నం

By

Published : Feb 23, 2022, 12:46 PM IST

Murder attempt on Daughter in Law: భర్త చనిపోయి ముగ్గురు పిల్లలతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కోడలిపై కన్నేశాడు ఓ కీచక మామ. ఎలాగైనా పెళ్లి చేసుకుని శారీరక వాంఛ తీర్చుకోవాలని చూశాడు. చివరికి ప్రయత్నం బెడిసికొట్టి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరయ్య.. తన కుమారుడికి సొంత చెల్లెలు కూతురుతో వివాహం జరిపించాడు. వారికి ముగ్గురు సంతానం. మూడేళ్ల క్రితం కుమారుడు డెంగ్యూతో మృతి చెందాడు. దీంతో కోడలు, పిల్లలు ఒంటరిగా మిగిలారు. దీనిని ఆసరాగా చేసుకున్న మామ.. కోడలిని లొంగదీసుకోవాలని చూశాడు. అందుకే పుట్టింటికి సైతం వెళ్లనీయకుండా.. కన్న కూతురిలా చూసుకుంటానంటూ నమ్మించాడు. అప్పటికీ బాధితురాలి తల్లి వారించినా.. 'మీకే తిండికి గతి లేదు.. మీరెలా చూసుకుంటారు' అంటూ దయాగుణం ప్రకటించి.. కోడలు పుట్టింటికి వెళ్లకుండా అడ్డుపడ్డాడు.

అత్త కూడా వంతపాడింది

మొదటి ఏడాది బాగానే చూసుకున్నా.. ఆ తర్వాత తన నిజస్వరూపం చూపించాడు. భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న కోడలిని కన్నకూతురిలా చూసుకోవాల్సింది పోయి.. సమయం చూసి తన మనసులో ఉన్న దురుద్దేశాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన తెచ్చాడు. ఈ విషయం విని అవాక్కయిన బాధితురాలు.. అత్తను తల్లిలా భావించి జరిగిన సంగతి చెప్పింది. కోడలిని కూతురులా భావించి మంచీ చెడు చూసుకోవాల్సిన అత్త సైతం.. ఆ దుర్మార్గుడికే వంత పాడింది. తన భర్తను పెళ్లి చేసుకోమని చెప్పింది. వారి అభిప్రాయాన్ని భర్త తోబుట్టువులు సైతం సమర్థించారు. వారి మనసులోని దురాలోచనను బయటపెట్టేసరికి తట్టుకోలేని కోడలు.. వారితో వాదనకు దిగింది. బాగా చూసుకుంటామని చెప్పి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించింది.

ఒప్పుకోకపోవడంతో వేధింపులు

దీంతో మామ ఈ సారి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఎలాగైనా కోడలిని లొంగదీసుకుని కామవాంఛ తీర్చుకోవాలని భావించిన అతడికి నిరాశ ఎదురయ్యే సరికి.. శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. బాధితురాలు వేధింపులు తాళలేక పలుమార్లు ఊళ్లో సర్పంచికి ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి కూడా సరైన స్పందన లేకపోవడంతో.. అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ వేధింపులు తప్పకపోవడంతో.. తల్లి, అన్నతో కలిసి చింతకాని పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు కోడలు ఫిర్యాదు చేసిందని తెలిసిన మామ.. ఆగ్రహంతో కత్తి తీసుకుని ఆమె పుట్టింటికి బయలుదేరాడు. కోడలిపై దాడి చేయబోతుంటే తల్లి అడ్డురావడంతో ఆ కత్తి పోట్లు ఆమెకు తగిలాయి. తప్పించుకున్న కోడలు.. ఇరుగుపొరుగు సాయంతో క్షతగాత్రురాలిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:Boy Kidnap in Hyderabad : హైదరాబాద్‌లో కిడ్నాప్‌ చేసి.. దిల్లీలో పోలీసులకు అప్పజెప్పాడు

ABOUT THE AUTHOR

...view details