ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లు సురేష్ కుమార్(45).. పిల్లలను కాపాడబోయి ప్రమాదవశాత్తు కాలువలో మునిగి మృత్యువాతపడ్డాడు. సురేష్ కుమార్.. తన కుమారుడు భవిత్(7), అన్న కొడుకుతో కలిసి ఈత కొట్టేందుకు సమీపంలోని సాగర్ ఎడమకాలువకు వెళ్లాడు. సురేష్ ఈత కొడుతుండగా.. చిన్నారులు ఒడ్డున కూర్చున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు భవిత్ కాలు జారి కాలువలో పడ్డాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మరో చిన్నారి కూడా నీటి ప్రవాహంలో మునిగిపోయాడు.
చిన్నారులను కాపాడే ప్రయత్నంలో తండ్రి మృతి - father died in medipally
నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న చిన్నారులను కాపాడబోయి ప్రమాదవశాత్తు తండ్రి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా మేడేపల్లి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
మేడేపల్లిలో తండ్రి మృతి
ఇద్దరు పిల్లలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండటం గమనించిన సురేష్.. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. కానీ ప్రమాదవశాత్తు తాను ప్రవాహంలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సురేష్‌ను వెలికితీశారు. అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:లక్షల్లో లాభాలు చూపిస్తూ... ఖాతాలో సొమ్ము కాజేస్తూ..