తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుమార్తె పుట్టిన రోజుకు కేకు ఆర్డర్‌ ఇచ్చి వస్తూ.. అనంతలోకాలకు.. - hyderabad Crime News

కుమార్తె పుట్టినరోజు కావడంతో కేకు ఆర్డర్‌ ఇచ్చి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందాడు. ఆ విషయం తెలియక తండ్రి కేకు తీసుకుని వస్తాడని చిన్నారి ఎదురుచూస్తుండటం స్థానికులను కలిచివేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

కుమార్తె పుట్టిన రోజుకు కేకు ఆర్డర్‌ ఇచ్చి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
కుమార్తె పుట్టిన రోజుకు కేకు ఆర్డర్‌ ఇచ్చి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

By

Published : Nov 20, 2022, 12:12 PM IST

ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం రామన్నపాలేనికి చెందిన జయరాజు కుమారుడు రవి(30) కొద్ది సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి గోల్కొండ, రామ్‌దేవ్‌గుడాలో అద్దెకు ఉంటున్నారు. విప్రో కంపెనీలో ఎలక్ట్రీషియన్​గా చేస్తున్నాడు. ఇద్దరు సంతానం. శనివారం కుమార్తె పుట్టిన రోజు కావడంతో సాయంత్రం నార్సింగిలోని ఓ బేకరీలో కేకు ఆర్డర్‌ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. తారామతి, బారాదరి వద్దకు రాగానే ముందున్న వాహనాన్ని దాటబోయి బైక్‌పై నుంచి కిందపడ్డాడు.

ఘటనలో రవి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిస్తే భార్య స్పందన ఎలా ఉంటుందోనని వెంటనే చెప్పేందుకు పోలీసులు వెనుకాడారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details