Father Commits Suicide with Children: నల్గొండ జిల్లాలోని దామెరచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పిల్లలకు విషమిచ్చి.. ఉరి వేసి.. అనంతరం తాను కూడా ఉరి వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దామెరచర్ల మండలంలోని నునావత్ తండాలో కిషన్ భార్య భూలక్ష్మీతో కలిసి ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కిషన్ మిర్యాలగూడాలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
భార్యతో గొడవ... పిల్లలను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య - family problems
08:23 December 24
Father Commits Suicide with Children: విషమిచ్చిన తర్వాత పిల్లలకూ ఉరి వేసి తండ్రి
ఈ క్రమంలో భార్య మరొకరితో అక్రమసంబంధం పెట్టుకున్నట్లు కిషన్ గుర్తించాడు. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. లాక్డౌన్లో కిషన్ పిల్లలను తీసుకుని తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. పెద్దమనుషుల వద్ద పంచాయతీ జరిగాక.. మళ్లీ భార్యతో కలిసి ఉంటున్నాడు.
పిల్లలను చంపేసి..
గురువారం సాయంత్రం భార్యతో గొడవపడిన కిషన్.. 6 గంటలకు ఇద్దరు పిల్లలను బయటకు వెళ్లాడు. గ్రామ శివారులోని పొలానికి పిల్లలను తీసుకెళ్లి.. శీతల పానీయంలో పురుగుల మందు కలిపి తాగించాడు. పిల్లలు మరణించిన అనంతరం వారికి ఉరి వేసి.. అక్కడే ఉన్న ఒక చెట్టుకు తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Inter student suicide : రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్.. ఉసురు తీసుకున్న విద్యార్థిని