జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మల్యాల మండల కేంద్రంలో 15 రోజుల వ్యవధిలో కొవిడ్ బారిన పడి తండ్రీకొడుకులు మృతి చెందారు.
కరోనాతో పక్షం రోజుల వ్యవధిలో తండ్రీకుమారుడు మృతి
కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిదిమేస్తోంది. బంధాలను కబళిస్తోంది. వైరస్ బారిన పడి రోజుల వ్యవధిలోనే తండ్రీకుమారుడు మరణించిన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటుచేసుకుంది.
కరోనాతో తండ్రీకొడుకు మృతి, కరోనా మరణాలు, కరోనా కేసులు
కట్కం లక్ష్మీనారాయణ గత 15 రోజుల క్రితం కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించాడు. అతని కుమారుడు మధు గురువారం రోజున మహమ్మారికి బలయ్యాడు. లక్ష్మీనారాయణ బీడీ కంపెనీ నిర్వహిస్తుండగా.. మధు లెక్టరర్గా పనిచేస్తున్నాడు. ఒకే ఇంట్లో తండ్రీకుమారుడు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.