తెలంగాణ

telangana

ETV Bharat / crime

Son and father: విషాదం.. కుమారుడి మరణ వార్త విని తండ్రి హఠాన్మరణం - నల్గొండ జిల్లా నేర వార్తలు

చేతికి అందివచ్చిన కుమారుడి మృతిని తట్టుకోలేక ఓ తండ్రి తనువు చాలించాడు. రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించాడన్న వార్త విని ఆ కన్నతండ్రి గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టి పాలెం వద్ద జరిగింది.

father and son  died in  Nalgonda district
కుమారుడి మరణ వార్త విని తండ్రి హఠాన్మరణం

By

Published : Oct 11, 2021, 4:54 AM IST

అల్లారుముద్దుగా పెంచుకుని తన ఆశయ సాధనలో పాలు పంచుకుంటున్న తనయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తట్టుకోలేని ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టి పాలెం శివారు వద్ద జరిగింది.

తడకమళ్ల గ్రామానికి చెందిన రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్ల ఇంద్రారెడ్డి కుమారుడు హైదరాబాద్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. తండ్రి ఆశయ సాధనకోసం ఉద్యోగం వదిలి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఆదివారం సాయంత్రం తోట నుండి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న తండ్రి ఇంద్రారెడ్డి.. కుమారుడి మృతదేహాన్ని చూసి అక్కడికక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. తండ్రీ, కుమారుల మరణంతో ఆ కుటుంబలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి:బుగ్గ జలపాతంలో యువకుడు గల్లంతు... గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details