Father and son died falling into a pond in AP: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్ధగుంట గ్రామంలో చెరువులో పశువులను దింపిన చెంగయ్య అనే వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందాడు. నీటి కుంటలో కూరుకుపోయి మృతిచెందిన తండ్రి మృతదేహంకోసం నీటిలోకి దిగిన చెంగయ్యా కుమారుడు నాగార్జున సైతం నీటితో మునిగి మృతి చెందాడు. చెంగయ్య తన పశువులను మేపేందుకు చెరువు గట్టుకు తీసుకు వెళ్లాడు. అనంతరం పశువులను కడిగేందుకు చెంగయ్య వాటితో పాటు చెరువులోకి దిగి గల్లంతయ్యాడు.
చెరువులోకి దిగి తండ్రి మృతి.. తండ్రిని వెతుకుతూ.. కుమారుడు మృతి
Father and son dead in pond: చెరువులో దిగి తండ్రీకుమారులు మృతి చెందిన విషాద ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా ఓజిలి మండలం గ్రద్ధగుంట గ్రామంలో జరిగింది. చెంగయ్య అనే వ్యక్తి పశువులను కడిగేందుకు చెరువులోకి దిగడంతోనే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని.. పోలీసులు వెల్లడించారు. చెంగయ్య సోమవారం సాయంత్రం చెరువులో దిగి గల్లంతయ్యాడు. తండ్రి ఇంటికి రాకపోవడంతో.. చెంగయ్య కుమారుడు నాగార్జున ఆందోళన చెందాడు. ఈ ఉదయం తండ్రి ఆచూకీ కోసం నాగార్జున చెరువులో దిగగా.. అతను కూడా ఊపిరాడక మృతి చెందాడు. తండ్రీకొడుకులిద్దరూ గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడంతో, ఊరిలో విషాదఛాయలు అలముకున్నాయి.
Father and son dead in pond
తండ్రి ఆచూకీ కోసం చెరువులోకి దిగిన కుమారుడు నాగార్జున నీటిలో మునిగి మృతి చెందాడు. తండ్రీకొడుకులు ఒకే ఘటనలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: