'నేను చనిపోతే నా బిడ్డను భార్య సరిగ్గా చూసుకోదు.. అందుకే..' - father daughter suicide in yadagirigutta
10:03 April 01
Father Daughter Suicide : యాదగిరిగుట్టలో తండ్రి, కుమార్తె ఆత్మహత్య
Father Daughter Suicide in Yadadri :"నా కుటుంబంతో నేను సంతోషంగా లేను. కుటుంబ కలహాల వల్లే నేను చనిపోదామనుకుంటున్నాను. నేనొక్కడినే చనిపోతే నా గారాలపట్టి.. నా పంచప్రాణాలు.. నా బంగారు తల్లి.. నా కూతురు శ్రేష్ఠ ఒంటరిదైపోతుంది. నా భార్య తనను సరిగ్గా చూసుకోదు. నేను లేకపోతే తను చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే తనను కూడా నాతో పాటే తీసుకువెళ్తున్నాను" అని సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తెతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదగిరిగుట్టలోని ఓ లాడ్జీలో చోటుచేసుకుంది.
Father Daughter Suicide in Yadagirigutta : యాదగిరిగుట్టలో గురువారం అర్ధరాత్రి ఓ లాడ్జీ భవనంపై నుంచి ఓ తండ్రి తన కుమార్తెతో కలిసి దూకాడు. గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి వారిని ఆస్పత్రికి తరలించారు. తండ్రీకుమార్తెలిద్దరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాలను పోలీసులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మృతులు చెరుకూరి సురేశ్(40), శ్రేష్ట(6)గా పోలీసులు గుర్తించారు. సురేశ్ హైదరాబాద్ బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనాస్థలిలో దొరికిన సూసైడ్ నోట్‌లో కుటుంబ కలహాల వల్లే చనిపోతున్నట్లు ఉందని పోలీసులు వెల్లడించారు.