Farmers Suicide: జనగామ జిల్లాలోని నర్మెట్ట మండలం ఆగపేటకు చెందిన యువరైతు నూనె రాజశేఖర్ తనకున్న రెండు ఎకరాల్లో పత్తిపంట సాగు చేశాడు. పంట సరిగ్గా రాకపోవడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు తీర్చలేకపోయాడు. పైగా తీవ్ర అనారోగ్యంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. వీటన్నింటికి కలిపి సుమారు మూడున్నర లక్షల అప్పు చేశారు.
ఈ రుణం తీర్చలేనని రాజశేఖర్ తీవ్ర మనస్తాపం చెందేవాడు. వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు సేవించి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కళ్యాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని.. స్థానికులు కోరారు.