Land Pooling: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూసమీకరణ నోటిఫికేషన్‌పై రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ నిలివేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించినా... అన్నదాతలు సంతృప్తి చెందట్లేదు. విచారణ పేరుతో పిలిచి పోలీసులు చితకబాదారని హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను ల్యాండ్ పూలింగ్ బాధితులు అడ్డుకున్నారు.
విచారణ పేరుతో పిలిచి రైతులను చితకబాదిన పోలీసులు - విచారణ పేరుతో రైతులను చితకబాదిన పోలీసులు
Land Pooling: విచారణ పేరుతో పిలిచి పోలీసులు చితకబాదారని హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను ల్యాండ్ పూలింగ్ బాధితులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను అడ్డుకున్న 12 మంది రైతులపై కేసు నమోదు చేశారు.
Land Pooling
ల్యాండ్ పూలింగ్ పేరిట తమ భూములను ఇచ్చేది లేదని ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న 12 మంది రైతులపై కేసు నమోదు చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున ముగ్గురు రైతులను పోలీస్ స్టేషన్‌కు తరలించి రక్తం వచ్చేలా చితకబాదారని... పరుశ పదజాలంతో దూషించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయ చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై పెత్తనం: కేసీఆర్