తెలంగాణ

telangana

ETV Bharat / crime

Farmer suicide: పంట దిగుబడి రాక.. అప్పు కట్టే దారిలేక.. రైతు ఆత్మహత్య.. - అన్నదాత ఆత్మహత్య

Farmer suicide: అన్నదాతల ఆత్మహత్యలు ఆగడంలేదు. భూమినే నమ్ముకున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. అర్ధాంతరంగా ఆయువు తీసుకుంటున్నారు. రోజూ ఎక్కడో ఓ చోటా ఇలాంటి విషాదకర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నల్గొండ జిల్లా కనగల్​ మండలం చెట్ల చెన్నారం గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Farmer suicide for debt burdens in chetla annaram
Farmer suicide for debt burdens in chetla annaram

By

Published : Mar 12, 2022, 7:21 PM IST

Farmer suicide: నల్గొండ జిల్లా కనగల్ మండలం చెట్ల చెన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక వడ్డేపల్లి అంజయ్య(45) అనే రైతు పొలం దగ్గరే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శివారులో ఐదెకరాల భూమిని అంజయ్య కౌలుకు తీసుకున్నాడు. అందులో.. పత్తి పంట వేశాడు. అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. చివరికి పంట దిగుబడి సరిగా రాలేదు.

అటు దిగుబడి రాక.. పెట్టుబడికి తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో తెలియక.. అంజయ్య తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. అతడి పొలం పక్కనే ఉన్న వేప చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. అంజయ్య భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details