అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు పొలంలోనే చెట్టుకు ఉరివేసుకున్నారు. ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం లింగారం గ్రామంలో చోటు చేసుకుంది.
అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్యాయత్నం - తెలంగాణ వార్తలు
అప్పులబాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ కలహాలు, అప్పుల బాధలతో మనస్తాపం చెంది పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నారని స్థానికులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా లింగారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, మహబూబ్నగర్లో రైతు ఆత్మహత్య
బాలానగర్ మండలం లింగారం గ్రామానికి చెందిన బర్రె భీమయ్యకు భార్యతో గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. ఓ వైపు భార్యతో గొడవ.. మరోవైపు అప్పుల బాధతో భీమయ్య తీవ్ర మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఆయన పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే భీమయ్యను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Last Updated : Mar 31, 2021, 6:14 PM IST