తెలంగాణ

telangana

ETV Bharat / crime

Farmer Suicide Attempt: 'భూమిని కౌలుకు ఇస్తే.. ఇప్పుడు మాదే అంటున్నారు' - Hyderabad latest news

Farmer Suicide Attempt : కౌలుకు ఇచ్చిన తమ భూమిని తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన గోడును అధికారులకు విన్నవించుకుందామని వస్తే వారూ పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్​ పోసుకొని బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన మేడ్చల్-మల్కాజి​గిరి కలెక్టరేట్​లో జరిగింది.

Farmer suicide attempt
Farmer suicide attempt

By

Published : Jan 16, 2023, 7:29 PM IST

Farmer Suicide Attempt : మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామానికి చెందిన గంగారాం కుటుంబసభ్యులకు 207 సర్వే నెంబర్​లో 18.5 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన వారికి కౌలుకు ఇచ్చి యాదాద్రి జిల్లా పుట్టగూడెం తండాకు వలసవెళ్లారు. ఇప్పుడు వచ్చి చూసేసరికి ఆ భూమిలో కౌలుకు ఇచ్చిన వారు కాకుండా వేరేవారు సాగు చేస్తున్నారు. అదేమిటని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకొని చంపుతామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు రాగా.. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ బాటిల్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు అడ్డుకొని కిరోసిన్ బాటిల్‌ను లాక్కున్నారు. న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.

"మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామంలో మా కుటుంబ సభ్యులకు 207 సర్వే నెంబర్​లో 18.5 ఎకరాల భూమి ఉంది. మేము బతుకుదెరువు కోసం భూమిని కౌలుకు ఇచ్చి ఊరు వదిలి వెళ్లిపోయాం. ఆ తర్వాత మా బంధువులు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వారి పేరు మీద రాసుకున్నారు. ఇప్పడు మాకు ఇవ్వడం లేదు. అధికారులకు చాలా సార్లు చెప్పాం. వారు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే మా సోదరుడు, నేను ఈ కలెక్టర్​ ఆఫీస్​కు వచ్చాం. అధికారులు పట్టించుకోపోవడంతో మా సోదరుడు ఒంటిపై కిరోసిన్​ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు."- గంగారాం, బాధితుడి సోదరుడు

మేడ్చల్ కలెక్టరేట్‌లో ఆవరణలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details