తెలంగాణ

telangana

ETV Bharat / crime

కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​.. భూమి పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం - Kamareddy Master Plan Controversy

Farmer suicide attempt: కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్​లో భూమి పోతుందన్న భయంతో మరో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రామేశ్వర్​పల్లికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ అనే రైతు ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా.. కుటుంబీకులు వెంటనే గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

Farmer commits suicide
Farmer commits suicide

By

Published : Jan 17, 2023, 3:58 PM IST

Updated : Jan 17, 2023, 4:54 PM IST

Farmer suicide attempt: కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​లో భాగంగా తన భూమి పోతుందన్న భయంతో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామేశ్వర్​పల్లికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ అనే రైతు ఇవాళ పురుగుల మందు తాగగా.. కుటుంబీకులు వెంటనే గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గ్రామంలో రైతు బాలకృష్ణకు ఎకరం భూమి ఉండగా.. ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్​లో తన భూమి పోతుందని మనస్థాపంతో ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు గ్రామస్థులు, కుటుంబీకులు చెబుతున్నారు.

కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​.. భూమి పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం
Last Updated : Jan 17, 2023, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details