కాళేశ్వరం లింక్-2 పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని జగిత్యాల జిల్లా వెల్గటూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట రాజక్కపల్లెకు చెందిన నిర్వాసిత రైతు దొరిసెట్టి శ్రీనివాస్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గమనించి అడ్డుకున్నారు.
భూమి కోల్పోయిన రైతు ఆత్మహత్యాయత్నం - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
జగిత్యాల జిల్లా వెల్గటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు దొరిసెట్టి శ్రీనివాస్ ఆత్మహత్యకు యత్నించారు. కాళేశ్వరం లింక్-2 పనుల్లో భూములు కోల్పోయినందున పరిహారం చెల్లించాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
కాళేశ్వరం పనుల్లో భూమి కోల్పోయిన రైతు ఆత్మహత్యాయత్నం
భూములు కోల్పోతున్న వారికి న్యాయం జరిగే వరకు తమ ఆందోళన ఆగదని రైతులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:పట్టా భూములపై వక్ఫ్ గెజిట్ జారీ.. రైతుల్లో ఆందోళన..