కొందరు తన భూమిని కబ్జా చేశారంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగింది. జిల్లాలోని డిచ్పల్లి మండలం యానాంపల్లికి చెందిన సంతోష్‌చారి.. జీననోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో తన పేరిట ఉన్న భూమి, తమ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఎకరన్నర భూమి ఇచ్చిందని.. దుబాయ్‌లో ఉండగా గ్రామానికి చెందిన అంకం గిరి, జయ్య రమేష్‌లు కబ్జా చేసి అమ్ముకున్నారని సంతోష్ కుమార్ పేర్కొన్నాడు.
భూమి కబ్జా చేశారని కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం - farmer Suicide attempt at the Collectorate in nizamabad district
కొందరు తన భూమిని కబ్జా చేశారంటూ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ వ్యక్తి. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయాడు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది.

కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నం
విషయం తెలుసుకున్న సంతోష్‌చారి స్వదేశానికి తిరిగి వచ్చాడు. తన భూమిని తిరిగి ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగానని.. అయినా ఫలితం లేదని వాపోయాడు. దానిపైనే తమ బతుకుదెరువు ఆధారపడి ఉందని.. గత్యంతరం లేక ఆత్మహత్య యత్నం చేశానని విలపించాడు. స్పందించిన కలెక్టర్ నారాయణ రెడ్డి.. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.
భూమి కబ్జా చేశారని కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం
ఇదీ చదవండి:కేబీఆర్ పార్కులో యువకుడు ఆత్మహత్యాయత్నం