మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్లో విషాదం చోటుచేసుకుంది. పంట సాగుకు చేసిన అప్పులు తీర్చలేక కొంగోడు సత్యనారాయణ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విషాదం: 'సాగు' అప్పులు తీర్చలేక రైతు బలవన్మరణం - medak district latest news
పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం: 'సాగు' అప్పులు తీర్చలేక రైతు బలవన్మరణం
గ్రామానికి చెందిన సత్యనారాయణ పంట సాగు కోసం అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చలేక.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అల్లాదుర్గం పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: ఆటోతో ఢీకొట్టి.. వైద్యం చేయించలేక డంపింగ్ యార్డులో పడేసి.!