elephant attack: ఏనుగుల దాడిలో రైతు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. కొమరాడ మండలం కల్లికోటకు చెందిన గోవింద రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్తుండగా గుంపు నుంచి విడిపోయిన ఏనుగు అతనిపై దాడి చేసింది. ఏనుగు దాడిచేయడంతో.. తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఏనుగుల దాడిలో మరణించిన వారి సంఖ్య 8కు చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. మిగిలిన ఏడు ఏనుగుల గుంపు ప్రస్తుతం గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఏనుగు దాడిలో రైతు మృతి.. భయాందోళనలో గ్రామస్థులు - గరుగుబిల్లి మండలం
elephant attack: ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం.. ఓ రైతు ప్రాణాలను తీసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతుపై ఏనుగు దాడి చేసి చంపేసింది. కొమరాడ మండలం కల్లికోటకు చెందిన రైతు గోవింద ఏనుగు దాడిలో చనిపోవడంతో.. గ్రామస్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
elephant attack