మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో నీట మునిగి రైతు మరణించాడు. బొడ్డితండాకు చెందిన ఆంగోతు చంద్రా (35) వ్యవసాయ పనుల నిమిత్తం.. వాగుకు అవతలి వైపున్న పొలానికి నీటిలోనుంచి నడుచుకుంటూ వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యాడు.
పొలానికి వెళ్తుడంగా వాగులో మునిగి రైతు మృతి - మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట
ప్రమాదవశాత్తు ఓ రైతు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో జరిగింది.

నీట మునిగి రైతు మృతి
సాయంకాలమైన ఇంటికి తిరిగిరాకపోవడంతో.. తండావాసులు వాగులో గాలింపు చర్యలు చేపట్టగా మృత దేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వాగు వద్దకు చేరుకుని మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి:దైవదర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు